News February 24, 2025
జగిత్యాల: రేపట్నుంచి ప్రచారం నిషేధం: కలెక్టర్

MDK, NZB, KNR, ALD పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఈ నెల 25 సాయంత్రం 4.00 నుంచి ఈ నెల 27 సాయంత్రం 4.00 వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, బల్క్ ఎస్ఎంఎస్లు పంపడంపై నిషేధమన్నారు.
Similar News
News February 25, 2025
ఇంటర్ పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి: ASF కలెక్టర్

జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
News February 25, 2025
చికిత్సకు సహకరిస్తున్న పోప్ ఫ్రాన్సిస్

పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని వాటికన్ సిటీ తెలిసింది. ‘డబుల్ న్యూమోనియా’తో పాటు కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న పోప్ 11 రోజుల నుంచి రోమ్‌లోని గెమెల్లీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డబుల్ న్యూమోనియా వల్ల ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకి ఆయన బ్రీతింగ్ తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తున్నారు.
News February 25, 2025
నల్గొండ: ఇంటర్, పది పరీక్షల నిర్వహణపై సమీక్ష

మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన చాంబర్లో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ,మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ఆయన తెలిపారు.