News March 28, 2025
జగిత్యాల: రేషన్‌షాపుల్లో సన్నబియ్యం.. అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. దీంతో జగిత్యాల జిల్లాలో 3,07,555 మంది లబ్ధిదారులకు లబ్ధి జరగనుంది. ఇది వరకు రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని అమ్ముకునేందుకు మొగ్గుచూపే వారు. ఇక నుంచి సన్నబియ్యం రేషన్ షాపుల్లో పంపిణీ చేయనుండటంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్ పడినట్టయ్యింది.
Similar News
News November 23, 2025
కడప జిల్లాలో వ్యక్తిపై కత్తితో దాడి.!

ముద్దునూరుకు చెందిన వినోద్ అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన నర్సింహులు శనివారం కత్తితో దాడి చేసినట్లు స్థానిక SI తెలిపారు. ముద్దనూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్మార్ట్ కిచెన్ పనుల విషయంలో ఈ దాడి జరిగిన ఎస్సై వివరించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News November 23, 2025
శబరిమలకు భక్తుల క్యూ.. వారంలోనే 5.75 లక్షల మంది దర్శనం

మండల-మకరవిళక్కు యాత్ర ప్రారంభంతో శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నవంబర్ 16 నుంచి మొదలైన యాత్రలో తొలి వారంలోనే 5.75 లక్షలకు పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే సాయంత్రం 7 గంటల వరకు 72,845 మంది సన్నిధానానికి చేరుకున్నారు. వర్షం పడినా యాత్రపై ప్రభావం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు.
News November 23, 2025
విశాఖ: ‘సివిల్స్ ఉచిత శిక్షణకు ఈనెల 25 చివరి తేదీ’

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు ఈ నెల 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు, వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష మించకుండా ఉన్నవారు అర్హులని తెలిపారు. దరఖాస్తును ఎంవీపీ కాలనీలోని బీసీ స్టడీ సర్కిల్లో ఇవ్వాలన్నారు.


