News February 6, 2025
జగిత్యాల: రైతుభరోసా నిధులు విడుదల
ఒక ఎకరం వరకు ఉన్న రైతుల అకౌంట్లలో ఇవాళ రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లు తెలిపింది. అయితే, రైతుభరోసా కింద జగిత్యాల జిల్లాలో 84,504 మంది రైతులకు గాను రూ.35,61,20,462 విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. రైతుభరోసా నిధులను విడుదల చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 6, 2025
ఆదిలాబాద్: రెండో భార్యను చంపిన భర్త
అనుమానంతో వ్యక్తి రెండో భార్యను హత్యచేశాడు. ఈఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్‌లో జరిగింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మరోతికి ఇద్దరు భార్యలు. ఈక్రమంలో రెండో భార్య అయిన రుక్కుబాయికి వివాహేత సంబంధం ఉందని అనుమానం పెట్టుకున్నాడు. మద్యం తాగి గొడవ చేసేవాడు, చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో మంగళవారం రుక్కుబాయి(26) ఛాతిపై బండతో కొట్టి హత్య చేశాడు.. కేసు నమోదైంది.
News February 6, 2025
INDvsENG: నేడే తొలి వన్డే.. మ.1.30 గంటలకు ప్రారంభం
నాగ్‌పూర్ వేదికగా నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి ODI జరగనుంది. మ.1.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20ల్లో చూపిన జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని IND ఉవ్విళ్లూరుతోంది. రోహిత్, కోహ్లీ, గిల్, రాహుల్, శ్రేయస్, హార్దిక్, అక్షర్, జడేజా, షమీ, అర్ష్‌దీప్, కుల్దీప్, సుందర్, వరుణ్‌లతో జట్టు సమతూకంగా ఉంది. అటు వన్డేల్లో బోణీ కొట్టాలని ENG ఆరాటపడుతోంది. స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
News February 6, 2025
అవగాహనతో రోడ్డు ప్రమాదాల నివారణ: అనకాపల్లి ఎస్పీ
ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా రహదారి ప్రమాదాలను నియంత్రించవచ్చునని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. రహదారి భద్రత మాసోత్సవాలు జిల్లాలో ఈ నెల 16 వరకు జరుగుతాయన్నారు. పలుచోట్ల రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దన్నారు.