News February 6, 2025
జగిత్యాల: రైతుభరోసా నిధులు విడుదల

ఒక ఎకరం వరకు ఉన్న రైతుల అకౌంట్లలో ఇవాళ రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లు తెలిపింది. అయితే, రైతుభరోసా కింద జగిత్యాల జిల్లాలో 84,504 మంది రైతులకు గాను రూ.35,61,20,462 విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. రైతుభరోసా నిధులను విడుదల చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 15, 2026
ప్రభాస్‌కు గాయం!

సినీ హీరో ప్రభాస్ గాయపడినట్లు సమాచారం. ఫౌజీ సినిమా షూటింగ్‌లో హార్స్ రైడ్ చేస్తుండగా ఆయనకు గాయమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో ఇవాళ షూటింగ్‌కు బ్రేక్ తీసుకున్నారని, రేపట్నుంచి మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటారని టాక్. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కీలకదశలో ఉంది. అటు సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు.
News February 15, 2026
అనంత: PGRS రద్దు.. కారణం ఇదే.!

ఈనెల 16న జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. CM ఆధ్వర్యంలో మంత్రులు, సెక్రటరీలతో కలిసి బిల్గేట్స్ బృందంతో విజయవాడలో జరిగే సమావేశం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కూడా కార్యక్రమాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు.
News February 15, 2026
జేఎన్టీయూ హాస్టల్‌లో శ్రీకాకుళం విద్యార్థిని సూసైడ్

కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఏ.అరుణ(19) ఇవాళ సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు సర్పవరం పోలీసులు తెలిపారు. జేఎన్టీయులోని నాగవల్లి లేడీస్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతురాలిది శ్రీకాకుళం జిల్లా పాలసింగి గ్రామం అని చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కేసుపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.


