News March 23, 2025
జగిత్యాల: రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు ‘ఛలో అసెంబ్లీ’

జగిత్యాల జిల్లా శాఖ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లాలోని రైతులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీని చేయాలని, కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15,000 అర్హుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లాలోని రైతులు అధికసంఖ్యలో రావాలని వారు కోరారు.
Similar News
News October 31, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 65,362 హెక్టార్లలో పంట నష్టం

మెుంథా తుఫాన్ కారణంగా అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం.. 65,362 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. సుమారు 74వేల మంది రైతుల పొలాలు దెబ్బతిన్నాయి. కృష్ణా (D) 46,357 హెక్టార్లలో నష్టం. వరి 45వేల హెక్టార్లు, మినుము 985 హెక్టార్లు, వేరుశనగ 288 హెక్టార్లు, పత్తి 48 హెక్టార్లు. NTR (D) 19,005 హెక్టార్లలో నష్టం. పత్తి 10వేల హెక్టార్లు, వరి 6వేల హెక్టార్లు.
News October 31, 2025
అనర్హత పిటిషన్లపై విచారణకు గడువు కోరిన స్పీకర్

MLAల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో 2 నెలలు గడువు కావాలని TG స్పీకర్ G ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టుకు విన్నవించారు.10 మంది MLAలకు నోటీసులివ్వగా 8 మంది స్పందించారు. వీరిలో 4గురి విచారణ ముగిసింది. SC విధించిన గడువు నేటితో ముగియడంతో మిగతా వారి విచారణకు సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాదులు కోరారు. నోటీసులకు స్పందించని ఇద్దరిపైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. కాగా కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.
News October 31, 2025
GNT: తప్పుడు ప్రచారాలపై పోలీస్ దృష్టి

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, పోలీసులపై తప్పుడు పోస్టులు పెరగడంతో గుంటూరు పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనుంది. వాట్సాప్ గ్రూపుల్లో అధికారులను సభ్యులుగా చేర్చి బ్లాక్మెయిలింగ్ చేస్తున్న ఘటనలపై ఫిర్యాదులు రావడంతో 15 గ్రూపులను గుర్తించారు. తొలి దశలో 10 గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు జారీ చేశారు. లాలాపేట, నగరంపాలెం, అరండల్పేట, పొన్నూరు, పెదకాకానిలో నివసించే అడ్మిన్లను విచారణకు పిలిపించారు.


