News April 24, 2024

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతిచెందాడు. బాధితుల ప్రకారం.. కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఏఖీన్‌పూర్‌కు చెందిన మనీశ్(25) HYDలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 6 రోజుల క్రితం కంపెనీ ప్రాజెక్టు పనిమీద పుదుచ్చేరి వెళ్లొస్తుండగా.. మార్గమధ్యలో డిండివనం వద్ద ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మనీశ్‌తో పాటు HYDకి చెందిన మరో మహిళా ఉద్యోగి మృతి చెందింది.

Similar News

News February 12, 2026

కౌంటింగ్‌ వేళ అప్రమత్తంగా ఉండాలి: సీపీ గౌష్‌ ఆలం

image

కరీంనగర్‌ జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌ యంత్రాంగం సిద్ధమైంది. నగరంలోని అస్త్ర కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్‌లో పోలీసు అధికారులకు, సిబ్బందికి సీపీ గౌష్‌ ఆలం దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకుండా నిఘా ఉంచాలన్నారు.

News February 12, 2026

కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ టాప్

image

కరీంనగర్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీ 81.47 శాతం పోలింగ్ నమోదు చేసి జిల్లాలో టాప్‌గా నిలిచింది. జమ్మికుంటలో 79.81%, చొప్పదండిలో 78.76%, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 62.98% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్‌లో 77.8% పోలింగ్ నమోదు కాగా, ఈసారి ఏకంగా 3.67 శాతం పెరిగింది. అధిక ఓటింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.