News April 10, 2025

జగిత్యాల వాసులారా.. మీ పిల్లలపై ఓ కన్నేయండి

image

వేసవి కాలం వచ్చింది అంటే చాలు చెరువులు, వాగులు, కాల్వల్లో పిల్లలు ఈత కొట్టడాన్ని మనం చూస్తూనే ఉంటాం. వీరిలో వేసవి తాపం తీర్చుకోవడానికి కొందరు, సరదా కోసం ఇంకొందరు, ఈత నేర్చుకోవడానికి మరికొందరు వెళ్తుంటారు. సరదా మాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించకుండా నీటిలో దిగడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఓ కన్నేసి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News November 1, 2025

కరీంనగర్: KGBVని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

image

కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలోగల KGBVని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న Physics Wallah Khan Academy క్లాసులను ఆమె పరిశీలించారు. తరువాత ఇంటర్‌మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం BIPC, MPC తరగతులను తనిఖీ చేశారు. కాలేజీలో బోధనా ప్రమాణాలను తెలుసుకొని తగిన సూచనలు చేశారు. విద్యాప్రమాణాల మెరుగుదలపై పాఠశాల సిబ్బందితో అ.కలెక్టర్ చర్చించారు.

News November 1, 2025

తొక్కిసలాటకు నిర్వాహకుల వైఫల్యమే కారణం: దేవాదాయ శాఖ

image

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో <<18167780>>తొక్కిసలాట <<>>ఘటనపై దేవాదాయ శాఖ స్పందించింది. అది పూర్తిగా ప్రైవేటు గుడి అని, ప్రభుత్వ అధీనంలో లేదని తెలిపింది. నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పింది. ప్రభుత్వానికి వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. కాగా ఈ ఆలయాన్ని ఇటీవలే ప్రారంభించారని అధికారులు చెబుతున్నారు.

News November 1, 2025

కన్నడను కాదనే వారందరూ మన వ్యతిరేకులే: సిద్దరామయ్య

image

హిందీ, సంస్కృతాల ప్రోత్సాహానికి అధిక నిధులు కేటాయిస్తూ ఇతర భాషలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని కర్ణాటక CM సిద్దరామయ్య విమర్శించారు. ‘రాష్ట్రం నుంచి ₹4.5 లక్షల కోట్లు కేంద్రానికి వెళ్తుండగా మనకు సరైన వాటా మేరకు నిధులు అందడం లేదు. అరకొరగా విదిలిస్తున్నారు’ అని మండిపడ్డారు. కన్నడను వ్యతిరేకించే వారందరినీ మనమూ వ్యతిరేకించాల్సిందేనని రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో ఆయన పిలుపునిచ్చారు.