News April 5, 2025

జగిత్యాల వాసులూ.. అప్లై చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను జగిత్యాల జిల్లాలోని స్థానిక MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News April 6, 2025

సూర్య తిలకం.. PHOTO OF THE DAY

image

యూపీ అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ఆలయ గర్భగుడిలో బాల రాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ వీక్షించి భక్తులు పరవశించిపోయారు. ఈ అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది PHOTO OF THE DAY అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి శ్రీరామ నవమి రోజున రాముడి నుదుటిపై సూర్య కిరణాలు పడేలా బెంగళూరు IIA, CBRI సైంటిస్టులు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

News April 6, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ☞ హజ్ యాత్ర అనేది ముస్లింలకు ఓ కల: మంత్రి ఫరూక్ ☞ రాములోరి కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి బీసీ ☞ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్సీ భూమిరెడ్డి ☞ నందిపాడులో ప్రమాదం.. యువకుడి మృతి ☞ బీసీ రాజారెడ్డిని కలిసిన సింగర్ కరీముల్లా ☞ కురుకుందలో గాలివాన బీభత్సం ☞ రేపు కలెక్టరేట్లో PGRS: కలెక్టర్ రాజకుమారి

News April 6, 2025

పశ్చిమ బెంగాల్‌లో వెల్లివిరిసిన మత సామరస్యం

image

పశ్చిమ బెంగాల్ సిలిగుడిలో మత సామరస్యం వెల్లివిరిసింది. శ్రీరామ నవమి శోభాయాత్ర చేస్తున్న భక్తులను ముస్లిం యూత్ పూలు చల్లుతూ ఆహ్వానించారు. ర్యాలీలో పాల్గొన్న వారికి వాటర్ బాటిల్స్ అందజేశారు. భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సిలిగుడిలో అన్ని మతాల వారు సోదర భావంతో నివసిస్తారని, మత వివక్ష ఉండదని భక్తులు తెలిపారు.

error: Content is protected !!