News February 22, 2025

జగిత్యాల: విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం గమ్యాన్ని ఏర్పరచుకోవాలి

image

విద్యార్థులు వారి యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొని ముందుకు సాగాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి లత పేర్కొన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

Similar News

News September 13, 2025

ములుగు: అత్యధికంగా వర్షం పడింది ఇక్కడే!

image

ములుగు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వాన కురిసింది. ప్రధానంగా ఏజెన్సీ మండలాలలో భారీ వర్షం పడింది. ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా వెంకటాపురం మండలంలో 106.5 మి.మీ. వర్షం కురిసింది. వాజేడు మండలం ధర్మారంలో 63మి.మీ., వాజేడులో 37మి.మీ., వెంకటాపూర్ లో 28.8మి.మీ., గోవిందరావుపేటలో 23.8మి.మీ., ఏటూరునాగారంలో 22.3మి.మీ. వర్షం పడింది.

News September 13, 2025

రాయికల్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

image

రాయికల్ పట్టణ శివారులోని కొమురం భీం చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అయోధ్య నుంచి రాయికల్ వైపు వస్తున్న యువకుడు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 13, 2025

మంచిర్యాల: గిరిజనుల సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలి: కలెక్టర్

image

సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్‌తో కలిసి దండేపల్లి మండలం దమ్మన్నపేట గిరిజనులతో ఆయన మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కింద వెదురు సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తామని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.