News February 1, 2025
జగిత్యాల: విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

ధర్మపురి మైనారిటీ కాలేజీలో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుట పడిన తరువాత జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అబ్జర్వేషన్ అనంతరం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
Similar News
News November 17, 2025
JGTL: ‘జూబ్లీ’ గెలుపు.. పార్టీ పరంగా BCలకు 42%..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపుతో అధికార పార్టీలో ఫుల్ జోష్ పెరిగింది. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 24న ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలపాలని హై కోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల నిర్వహణ సర్కార్కు అనివార్యంగా మారింది. అయితే, పాత రిజర్వేషన్ల ప్రకారమే వెళ్లి, పార్టీ పరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే అవకాశాలున్నాయి.
News November 17, 2025
రాజకీయ కుటుంబాల్లో ఇంటిపోరు.. పార్టీల కుదేలు

రాజకీయాల్లో అవకాశాల కోసం ఆడబిడ్డల పోరు పొలిటికల్ ఫ్యామిలీలలో చిచ్చు పెడుతోంది. APలో జగన్ సోదరి షర్మిల, TGలో KTR చెల్లెలు కవిత బాటలోనే బిహార్లో తేజస్వి సోదరి రోహిణి బంధాలను తెంచుకున్నారు. ఇంటి పోరుతో ఆయా పార్టీలు కుదేలవుతున్నాయి. ఎన్నికలకు ముందు షర్మిల వేరుకుంపటి పెట్టుకోగా, ఎన్నికల తర్వాత కవిత, రోహిణి తమ బాధను వెళ్లగక్కారు. రానున్న రోజుల్లో ఈ గొడవలకు ముగింపు దొరుకుతుందా? వేచిచూడాల్సిందే.
News November 17, 2025
NTR: రైళ్లలో సీసీ కెమెరాలు.. మరీ ఇంత నెమ్మదిగానా..?

రైళ్లలో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు విజయవాడ డివిజన్ పరిధిలోని కోచ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 920 కోచ్లకు గాను కేవలం 51 కెమెరాలే ఏర్పాటు చేయగా, అందులో 34 మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


