News February 1, 2025
జగిత్యాల: విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

జగిత్యాల జిల్లా ధర్మపురి మైనారిటీ కాలేజీలో వాంతులు, విరేచనాలతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై జిల్లా కలెక్టర్ బీ.సత్యప్రసాద్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుట పడిన తరువాత జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అబ్జర్వేషన్ అనంతరం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
Similar News
News October 20, 2025
509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పురుషులకు 341, మహిళలకు 168 జాబ్లు ఉన్నాయి. వయసు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. SC, STలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://ssc.gov.in
News October 20, 2025
దీపావళి రోజున కచ్చితంగా చేయాల్సిన పనులు

లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే ఇష్టం. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచి, ప్రతి మూల దీపాలు వెలిగించి పూజ చేయాలి. పూజ సమయంలో విగ్రహం (లేదా) ఫొటోను ఎర్రటి వస్త్రంపై ఉంచాలి. పూజను తూర్పు (లేదా) ఈశాన్య మూలలో చేయాలి. ఇంటి గుమ్మం వద్ద కుంకుమ, పసుపుతో స్వస్తిక్ వేసి, గడపకు పూజ చేయాలి. ఇది పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తుంది. పూజలో భాగంగా అఖండ దీపం వెలిగిస్తే.. అది మరుసటి రోజు ఉదయం వరకు ఆరిపోకుండా జాగ్రత్త వహించాలి.
News October 20, 2025
వచ్చే నెల 3 నుంచి కాలేజీల బంద్!

TG: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే వచ్చే నెల 3 నుంచి కాలేజీల బంద్ చేపడుతామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తెలిపాయి. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుకు వినతి పత్రం అందజేశాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.900 కోట్లను నవంబర్ 1వ తేదీలోపు రిలీజ్ చేయాలని కోరాయి. బంద్కు సంబంధించి ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి.