News February 1, 2025
జగిత్యాల: విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

జగిత్యాల జిల్లా ధర్మపురి మైనారిటీ కాలేజీలో వాంతులు, విరేచనాలతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై జిల్లా కలెక్టర్ బీ.సత్యప్రసాద్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుట పడిన తరువాత జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అబ్జర్వేషన్ అనంతరం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
Similar News
News February 19, 2025
మెదక్: ఎన్నికల విధులపై కలెక్టరేట్లో సమీక్ష

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల 27న నిర్వహించే మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్ ఎక్కా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎన్నికల విధులు విధులు నిర్వహించే వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు.
News February 19, 2025
సెంచరీలతో చెలరేగిన NZ బ్యాటర్లు.. పాక్ టార్గెట్ ఎంతంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో పాక్‌పై న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ విల్ యంగ్(107), టామ్ లాథమ్(118*) సెంచరీలతో చెలరేగారు. వీరికి తోడు ఆల్‌రౌండర్ ఫిలిప్స్(61) అర్ధ సెంచరీతో రాణించడంతో NZ 320/5 స్కోర్ చేసింది. కాన్వే 10, విలియమ్‌సన్ 1, మిచెల్ 10 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హరీస్ రౌఫ్ తలో రెండు, అబ్రార్ ఒక వికెట్ తీశారు. హరీస్ రౌఫ్ 10 ఓవర్లలో 83 పరుగులు సమర్పించుకున్నారు.
News February 19, 2025
శివరాత్రి వేడుకలు విజయవంతం చేయాలి: అదనపు కలెక్టర్

మహాశివరాత్రి వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో పోలీసులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి 28 వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భక్తుల సంఖ్య దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల కోసం అవసరమైన పందిర్లు ఏర్పాటు చేయాలని కోరారు.