News February 1, 2025
జగిత్యాల: విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

ధర్మపురి మైనారిటీ కాలేజీలో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుట పడిన తరువాత జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అబ్జర్వేషన్ అనంతరం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
Similar News
News March 15, 2026
నన్ను డ్రగ్స్ కేసులోకి లాగితే లీగల్ యాక్షన్ తప్పదు: KTR

TG: ప్రతీ డ్రగ్స్ కేసులోకి తనని లాగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని KTR హెచ్చరించారు. ఎలాంటి టెస్ట్‌కైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ప్రతీసారి BRS పార్టీని లాగడం దారుణమన్నారు. తాను, తమ పార్టీ డ్రగ్స్ వాడకానికి పూర్తి వ్యతిరేకమన్నారు. BRS Ex MLA పైలట్ <<19386182>>రోహిత్ రెడ్డి<<>> డ్రగ్స్ కేసులో చిక్కుకున్న నేపథ్యంలో KTR వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
News March 15, 2026
ఏలూరు: అక్షర ఆంధ్ర పరీక్షలను పరిశీలించిన కలెక్టర్

ఏలూరులోని శ్రీ సాయీశ్వరి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం జరిగిన ‘అక్షర ఆంధ్ర’ తుది పరీక్షలను కలెక్టర్ వెట్రిసెల్వి పర్యవేక్షించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 588 కేంద్రాల్లో 97,200 మంది వయోజన అభ్యాసకులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 2,117 మంది సిబ్బందిని నియమించామని, అన్ని కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించామని ఆమె వెల్లడించారు.
News March 15, 2026
శ్రీశైలం: ఆడపడుచు చెంతకు ఆత్మీయంగా సారె

కన్నడీగురాలైన శ్రీ భ్రమరాంబ పరమేశ్వరుడిని వరించాలనుకుంటుంది. ఓ రోజు కలలో శివుడు ప్రత్యక్షమై భ్రమర(తుమ్మెద)ను చూపించి అది నిలిచిన చోట ఆగాలని చెప్తాడు. శ్రీశైలం వద్ద భ్రమర ఆగడం, అక్కడే భ్రమరాంబ నిలిచినట్లు పురాణాల కథనం. భ్రమరాంబికా దేవిని మల్లికార్జునుడు వరించడంతో కన్నడ భక్తులు తమ ఆడపడుచుగా భావిస్తారు. అప్పటి నుంచి ఉగాది పండుగకు తమ ఆడపడచైన భ్రమరాంబకు చీర, సారె తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది.


