News April 9, 2025
జగిత్యాల: విద్యుత్తు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: SE

విద్యుత్త ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలని జగిత్యాల SE సాలియా నాయక్ తెలిపారు. వర్షాలు కురుస్తున్నప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాలు, వైరును తాకరాదన్నారు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా తక్కువ ఎత్తులో ఉన్న తీగలను ముట్టుకోవద్దన్నారు. పశువులను మేతకు తీసుకువెళ్ళినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏదైన సమస్య ఉంటే 1912కు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News April 18, 2025
వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్‌గా యుద్ధ బాధితుడి చిత్రం

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో గాయపడిన ఓ బాలుడి చిత్రం ఈ ఏడాది వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. పాలస్తీనాకు చెందిన ఫొటోగ్రాఫర్ సమర్ అబు ఎలూఫ్ ఈ ఫొటో తీశారు. ఈ చిత్రంలోని బాలుడు రెండు చేతులు కోల్పోయి దీనస్థితిలో కనిపిస్తున్నాడు. ఈ యుద్ధం వల్ల భవిష్యత్తు తరాలు ఎలా అంధకారంలోకి వెళ్లాయో ఈ చిత్రం చెబుతుందని వరల్డ్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.
News April 18, 2025
సంగారెడ్డి: భర్త ఆత్మహత్య

భార్యలు తన దగ్గర లేరని భర్త గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. అస్సాంకు చెందిన బిశాల్(30) కొల్లూరులో కార్ వాష్ సెంటర్లో పనిచేస్తున్నాడు. మొదటి భార్యతో బిశాల్ తరుచూ గొడవపడటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత నందిగామకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారు తరుచూ గొడవపడటంతో ఆమె కూడా వెళ్లింది. మనస్థాపం చెందిన బిశాల్ కారు వాష్ సెంటర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు.
News April 18, 2025
కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదని నిరూపించే సమయమిది: కేటీఆర్

TG: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రధాని మోదీ కేవలం మాటలకే పరిమితం కావొద్దని KTR కోరారు. అందులో జీవవైవిధ్యాన్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థిక కుంభకోణం జరిగిందని చెప్పారు. భూముల తాకట్టు వ్యవహారాన్ని CBI, SEBI, RBI దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. TGలో కాంగ్రెస్, BJP ఒకటి కాదని నిరూపించే సమయమిదని వ్యాఖ్యానించారు.