News April 10, 2024
జగిత్యాల: విషాదం.. యువకుడి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో విషాదం జరిగింది. రామన్నపేట గ్రామానికి చెందిన వాకులాబరణం మణిదీప్ (30) ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మల్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే మృతికి గల కారణం తెలియాల్సి ఉంది. మణిదీప్ మృతి పట్ల కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.
Similar News
News December 1, 2025
KNR: లింగ నిర్ధారణ చేస్తే చర్యలు తప్పవు: DMHO

లింగ నిర్ధారణ నిషేధ చట్టం (PCPNDT) అమలుపై DMHO డా.వెంకటరమణ అధ్యక్షతన అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశం కరీంనగర్ DMHO కార్యాలయంలో నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 07 స్కానింగ్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నేరమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణ చేస్తే 9849902501 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News December 1, 2025
KNR: ‘హెచ్‌ఐవీ తగ్గుముఖం.. ‘జీరో’ లక్ష్యంగా కృషి’

దేశంలో ఎయిడ్స్ తగ్గుముఖం పడుతుందని ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా కరీంనగర్ ఫిలిం భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను ‘జీరో’కు తీసుకురావడమే ధ్యేయమన్నారు. వ్యాధిగ్రస్తులు ధైర్యంగా మందులు వాడాలని సూచించారు. అనంతరం ఐసీటీసీ కౌన్సిలర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
News December 1, 2025
‘TCC పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవాలి’

TG ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించే డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ TCC(టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా DEC 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఆర్ట్ వర్క్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లాఅధ్యక్షులు తాడూరి లక్ష్మీనారాయణ సూచించారు. పూర్తి వివరాలకు www.bsetelangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన కోరారు.


