News March 21, 2025
జగిత్యాల: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

10వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. పరీక్షలను నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సజావుగా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా సూచించారు. ప్రశ్న పత్రాల తరలింపు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 7, 2025
రేపు ప్రకాశం జిల్లాలో పాఠశాలలకు సెలవు రద్దు

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో గత నెలలో ఐదు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన కారణంగా ఈనెల 8న రెండో శనివారం అన్ని యాజమాన్య పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని DEO కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. 2026 మార్చి వరకు ప్రతి రెండో శనివారం పాఠశాలలను నిర్వహించాలన్నారు. పాఠశాలల సిబ్బంది నియమాలు పాటించాలన్నారు.
News November 7, 2025
సూర్యాపేట: భార్యను చంపిన భర్త

సూర్యాపేట జిల్లా మోతె మండలం విభాళాపురంలో దారుణం జరిగింది. భర్త మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 7, 2025
కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్

TG: గతంలో అభివృద్ధి చేసిన PJR, మర్రి శశిధర్ రెడ్డి HYD బ్రదర్స్ అయితే, ఇప్పుడు డెవలప్మెంట్ను అడ్డుకుంటున్న KTR, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని CM రేవంత్ విమర్శించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRRను అడ్డుకుంటోంది వీరేనని మండిపడ్డారు. BRS హయాంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. KCR, KTR, హరీశ్ రావు వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని CM దుయ్యబట్టారు.


