News March 19, 2025
జగిత్యాల: వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న నలుగురు వివిధ ఘటనల్లో చనిపోయారు. JGTLరూరల్(M) వెల్దుర్తికి చెందిన రాజం(55) అనే <<15808621>>రైతు<<>> అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో గంగాధర(M) ఉప్పరమల్యాలకు చెందిన మల్లేశం(42) చనిపోయాడు. బసంత్నగర్కు చెందిన ఆరె అజయ్(24) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాపూర్(M) బొమ్మకల్లో నీటి సంపులో పడి పజ్ఞాన్ అనే రెండేళ్ల బాలుడు మృతిచెందాడు.
Similar News
News March 19, 2025
MBNR: ‘బీసీ బిల్లు బీసీ సంఘాల ఐక్య పోరాట ఫలితమే’

రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం బిల్లు బీసీ రాజ్యాధికారానికి తొలిమెట్టు అని బీసీ సమాజ్ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా బీసీ సమాజ్ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీని అమలు చేసినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు పాల్గొన్నారు.
News March 19, 2025
SRH జెర్సీలో మహ్మద్ షమీ.. పిక్ వైరల్

ఐపీఎల్ 2025 కోసం మహ్మద్ షమీ సన్నద్ధమవుతున్నారు. SRH జెర్సీ ధరించి ఆయన ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఐపీఎల్ మెగా వేలంలో షమీని SRH రూ.10 కోట్లకు దక్కించుకుంది. జట్టు పేస్ దళాన్ని షమీ నడిపించనున్నారు.
News March 19, 2025
వనపర్తి: త్వరలోనే ముస్లింలకు ఇఫ్తార్ విందు..

ముస్లింల పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు విషయంపై సమన్వయ సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందు తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.