News March 30, 2025
జగిత్యాల: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

JGTL(M) తిప్పన్నపేటకు చెందిన చింతకుంట్ల రాజనర్సయ్య(58) విద్యుదాఘాతంతో చనిపోయాడు. సుల్తానాబాద్(M) గర్రెపల్లిలో SRCL(D) తంగళ్లపల్లి(M) చీర్లవంచకు చెందిన పత్రి కళావతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గంగాధర పంచాయతీ కార్మికుడు షాహిద్(28) గుండెపోటుతో మరణించాడు. తంగళ్లపల్లి(M) బస్వాపూర్‌కు చెందిన బంటు ఆనందం చెట్టుపై నుంచి పడి మృతిచెందాడు. KNRలోని రేకుర్తిలో చెరువులో పడి శ్రీనిధి అనే <<15924920>>బాలిక<<>> చనిపోయింది.
Similar News
News September 14, 2025
త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం

లక్నో విమానాశ్రయంలో లక్నో- ఢిల్లీ ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్న విమానం టేకాఫ్ సమయంలో రన్‌వే మీద ఒక్కసారిగా స్లో అయింది. పైలట్ చాకచక్యంగా ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగించి ఫ్లైట్‌ను రన్‌వే దాటకుండా ఆపారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
News September 14, 2025
శ్రీశైలం ప్రాజెక్ట్ తాజా సమాచారం

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుండటంతో డ్యామ్ 7 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
◆ ఇన్ ఫ్లో: 1,57,458 క్యూసెక్కులు
◆ అవుట్ ఫ్లో: 2,60,401 క్యూసెక్కులు (7 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా)
◆ ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 884.40 అడుగులు
◆ నీటి నిల్వ: 212.4385 టీఎంసీలు
News September 14, 2025
ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం విఫలం: YCP

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను YCP నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్, మొండితోక జగన్మోహన్ తదితరులు బాధితులతో మాట్లాడారు. ‘న్యూరాజరాజేశ్వరిపేటలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. డోర్2డోర్ సర్వే చేసి బాధితుల వివరాలు సేకరించాలి. డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థలను మెరుగుపరచాలి. మెడికల్ క్యాంపుల ద్వారా వారికి భరోసా ఇవ్వాలి’ అని వారు పేర్కొన్నారు.