News January 31, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 5200, గరిష్ఠ ధర రూ. 6143గా పలికింది. అటు అనుములు క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 6259, గరిష్ఠ ధర రూ. 7323, మక్కలు రూ. 2260, వరి ధాన్యం (HMT) రూ. 2311, వరి ధాన్యం (JSR) కనిష్ఠ ధర రూ. 2411, గరిష్ఠ ధర రూ. 2611గా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.
Similar News
News March 1, 2025
ఎస్.కోట: తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య

ఎస్.కోటకి చెందిన వ్యక్తి తల్లి చనిపోయిందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. CI నారాయణమూర్తి వివరాల ప్రకారం.. మండలంలోని అయితన్నపేటకి చెందిన సంతోశ్ కుమార్(35) తల్లి మూడేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి మనస్తాపానికి గురైన సంతోశ్ ఫిబ్రవరి 25న మందులో పురుగుమందు కలుపుకొని తాగాడు. దీంతో అతడిని ఎస్.కోట ఆస్పత్రికి తరలించాడు. అక్కడి నుంచి విజయనగరం తరలించగా చికిత్స పొందతూ శుక్రవారం మృతిచెందాడు.
News March 1, 2025
ఎల్కతుర్తి: క్రేన్ తగిలి తండ్రి, కొడుకు స్పాట్ డెడ్

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రేన్ తగిలి తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతులు కోతులనడుమ గ్రామానికి చెందిన రాజేశ్వర్ రావు, వికాస్గా గుర్తించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 1, 2025
సెమీఫైనల్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ షార్ట్ సెమీస్లో ఆడేది అనుమానమేనని కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పారు. షార్ట్ గాయంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అతని స్థానంలో మెక్ గుర్క్, అరోన్, కూపర్లలో ఒకరిని తీసుకుంటామని చెప్పారు. నిన్న వర్షం కారణంగా రద్దైన మ్యాచులో షార్ట్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యారు.