News February 17, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

జగిత్యాల మార్కెట్‌లో దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ ధర రూ.6,311 నుంచి రూ. 7,337 మధ్య పలికాయి. అనుములు రూ.4,089 నుంచి రూ.6,889, అలసందలు రూ.8,000, పెసర్లు రూ.8,500, పల్లికాయ రూ.2,811, నువ్వులు రూ.9,689, మక్కలు రూ.2,106 నుంచి రూ.2,256, వరి ధాన్యం (1010) రూ.1,700 నుంచి రూ.1,755, వరి ధాన్యం (HMT) రూ.2,271, వరి ధాన్యం (JSR) రూ.2,666గా పలికాయి. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.
Similar News
News March 20, 2025
చంద్రబాబుతో భేటీపై బిల్‌గేట్స్ ట్వీట్

మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నిన్న భేటీ అయి పలు ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై బిల్‌గేట్స్ ట్వీట్ చేశారు. ‘బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సీఎం చంద్రబాబును కలవడం సంతోషం. వైద్యం, వ్యవసాయం, విద్యలో ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి రాష్ట్రానికి మద్దతునిస్తూ వారితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News March 20, 2025
మన ‘సంతోషం’ తక్కువేనట..

ప్రపంచ సంతోష సూచీలో వరుసగా 8వ సారి ఫిన్లాండ్ తొలి స్థానంలో నిలిచింది. 147 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 118వ స్థానంలో నిలిచింది. పొరుగు దేశాలు నేపాల్(92), PAK(109) భారత్ కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి. అయితే గత ఏడాది(126)తో పోలిస్తే ఇండియా తన పొజిషన్‌ను కాస్త మెరుగుపరుచుకుంది. కాగా సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు ఇస్తారు.
News March 20, 2025
భారత జట్టుకు భారీ నజరానా

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.58 కోట్ల నజరానా ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది. మార్చి 9న న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఐసీసీ ప్రైజ్ మనీ(రూ.19.50+కోట్లు)తో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ కావడం గమనార్హం.