News February 4, 2025

జగిత్యాల: శిశు మరణాల రేటును తగ్గించాలి: కలెక్టర్

image

శిశు మరణాల రేటును తగ్గించుటకు కృషి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో మంగళవారం చైల్డ్ డెత్ రివ్యూ పై వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరణాలు సంభవించకుండా తప్పించే మార్గాలను అన్వేషించాలని సూచించారు. ట్రాన్స్పోర్టేషన్ మెరుగుపరచాలని, వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. గృహ సందర్శన సమయంలో బాలింతలకు కౌన్సెలింగ్ చేయాలన్నారు. అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 31, 2025

HYD: రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట జరుగకుండా చర్యలు

image

పండగలు, ప్రత్యేక రోజుల్లో సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఒక్కోసారి రద్దీ ఎక్కువై అదుపుతప్పి తొక్కిసలాట జరుగుతుంది. ఈ ప్రమాదాలు జరుగకుండా రైల్వే శాఖ కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు హోల్డింగ్ ఏరియాలను త్వరలో ఏర్పాటు చేయనుంది. ఇవి అందుబాటులోకి వస్తే తోసుకోవడం, తొక్కిసలాట సమస్యలు ఉండవని అధికారులు చెబుతున్నారు.

News October 31, 2025

NABFINSలో ఉద్యోగాలు

image

నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీస్ (NABFINS) వివిధ రీజియన్లలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పని అనుభవం ఉన్నవారు, ఫ్రెషర్స్ కూడా దరఖాస్తుకు అర్హులే. టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. వెబ్‌సైట్: https://nabfins.org/

News October 31, 2025

జూబ్లీహిల్స్: నేటి నుంచి బీఆర్ఎస్ ‘మాట.. ముచ్చట’

image

జూబ్లీహిల్స్ ఎన్నికకు కేవలం 10 రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ‘మాట.. ముచ్చట’ కార్యక్రమం జరుగనుంది. నియోజకవర్గంలో రద్దీ ప్రాంతాల్లో పార్టీ నాయకులు స్థానికులతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తారు. నగర అభివృద్ధిపై మాట్లాడనున్నారు.