News February 4, 2025
జగిత్యాల: శిశు మరణాల రేటును తగ్గించాలి: కలెక్టర్

శిశు మరణాల రేటును తగ్గించుటకు కృషి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో మంగళవారం చైల్డ్ డెత్ రివ్యూ పై వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరణాలు సంభవించకుండా తప్పించే మార్గాలను అన్వేషించాలని సూచించారు. ట్రాన్స్పోర్టేషన్ మెరుగుపరచాలని, వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. గృహ సందర్శన సమయంలో బాలింతలకు కౌన్సెలింగ్ చేయాలన్నారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 12, 2026
వనపర్తి: కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా శాంతి పద్ధతుల పరిరక్షణ కోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద BNS 163 (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వనపర్తి ఎస్పీ సునీతారెడ్డి చెప్పారు. వనపర్తి జిల్లా పరిధిలోని 5 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద 850 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
News February 12, 2026
ASF: నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. స్థానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. 20 వార్డులకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల భద్రతను సమీక్షించిన కలెక్టర్, కేంద్రం వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
News February 12, 2026
బయో మిథనైజేషన్ ప్లాంట్‌కు ప్రతిపాదనలు: కమిషనర్

నగరంలో వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచేందుకు బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. గురువారం ఎన్‌ఐయూఏ, ఈడబ్ల్యూ సిటీ ప్రతినిధులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే ఆర్ఎఫ్పీ (ప్రతిపాదనలు)లను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు మహేందర్, మాధవీలత తదితరులు పాల్గొన్నారు.


