News February 5, 2025
జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!
చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
Similar News
News February 5, 2025
KNR: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి బీ ఫాం అందజేత
కరీంనగర్, NZBD, ADLBD, MDK పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి బీఫాంను బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందజేశారు. తనపై పార్టీ నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు బీజేపీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంజిరెడ్డి తరఫున బీ ఫాంను ఆయన కుమార్తె తీసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
News February 5, 2025
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒప్పుకోని ‘AAP’
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కొద్దిసేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఆప్ నేత సుశీల్ గుప్తా ఒప్పుకోలేదు. ‘ఇవి మాకు నాలుగో ఎన్నికలు. ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఆప్‌కు అధికారం వస్తుందని అంచనా వేయలేదు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పని చేశారు. ఫలితాలు మాకే అనుకూలంగా వస్తాయి. కచ్చితంగా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా అంచనా వేశాయి.
News February 5, 2025
వనపర్తి: ఏఆర్ కానిస్టేబుల్ సస్పెండ్.!
వనపర్తి జిల్లా సాయుధ దళ కార్యాలయం (ఆర్మ్డ్ రిజర్వ్) విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ డి.రవి కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్ రవికుమార్‌పై పెబ్బేరు పోలీస్ స్టేషన్లో ఒకే రోజు 3 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిర్లక్ష్యంగా, దుష్ప్రవర్తనతో వ్యవహరించిన కారణంగా కానిస్టేబుల్ రవికుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.