News February 5, 2025

జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

image

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్‌ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

Similar News

News February 18, 2025

ఎల్లారెడ్డిపేట: బస్సు టైర్ పంచర్.. తప్పిన ప్రమాదం

image

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామ శివారులోని బస్సు టైర్ పంచర్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు 110మంది ప్రయాణికులతో వెళుతుండగా బస్సు ఒక్క సైడు ఒరిగి ఆగిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సిరిసిల్ల నుంచి వన్ పల్లికి మరికొన్ని బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News February 18, 2025

నిర్మల్: పీఎం శ్రీ బడులకు నిధులు మంజూరు

image

పీఎం శ్రీ ద్వారా కేటాయించిన నిధులను విద్యాసంస్థల్లో మౌలిక వసతులను సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో పీఎం శ్రీ నిధుల వినియోగంపై ఆమె సమీక్ష  నిర్వహించారు. జిల్లాలోని పాఠశాలలకు కేటాయించిన పీఎంశ్రీ నిధులు, ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన వివరాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

News February 18, 2025

ఫిబ్రవరి 18: చరిత్రలో ఈరోజు

image

1745: బ్యాటరీ ఆవిష్కర్త ఇటలీ శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా జననం
1836: ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం
1939: ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ మరణం
2002: ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్ జననం
2014: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2015: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణం
2023: నటుడు నందమూరి తారకరత్న మరణం

error: Content is protected !!