News February 5, 2025
జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
Similar News
News November 16, 2025
నేలమట్టం కానున్న మహబూబ్నగర్ రైల్వే స్టేషన్..!

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 1993 సంవత్సరంలో నిర్మించిన రైల్వే స్టేషన్ త్వరలో నేలమట్టం కాబోతోంది. ఈ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా ఎంపిక చేశారు. కూల్చిన అనంతరం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దగ్గర్లోనే టికెట్ బుకింగ్, విచారణ ఇలాంటివి అన్ని ఏర్పాటు చేయనున్నారు. పురాతన సామగ్రిలను మరో గదిని చూసి అందులో భద్రపరచనున్నారు.
News November 16, 2025
SRPT: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: డీఈఓ

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని డీఈఓ అశోక్ అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు ఆధ్వర్యంలో రెండవ రోజు పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సరస్వతి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి. బాలమ్మ, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.
News November 16, 2025
సిద్దిపేట: ‘ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి’

జిల్లాలో ఉన్న ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, ఏయిడెడ్, మున్సిపల్లో 2025-26 సంవత్సరానికి 9,10వ తరగతి చదవుకుంటున్న విద్యార్థులు ఉపకార వేతనాలు పొందెందుకు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు తగు సూచనలు చేయాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి రఫీక్ తెలిపారు. https/telanganaepass,cgg, gov,in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


