News February 5, 2025

జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

image

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్‌ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

Similar News

News February 9, 2025

గిల్ ఉంటే రో‘హిట్’

image

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా వన్డేల్లో గిల్‌తో ఓపెనింగ్ చేసిన మ్యాచుల్లో హిట్ మ్యాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. గత ఎనిమిది ఇన్నింగ్సుల్లో 2 సార్లు సెంచరీ, 4 సార్లు అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. ఇవాళ్టి మ్యాచులో 100 బంతుల్లో 136 పరుగులు నమోదు చేశారు.

News February 9, 2025

నిర్మల్ జిల్లా నేటి TOP NEWS

image

★ బైంసా: రోడ్డు ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి ★ నిర్మల్: నులిపురుగుల మాత్రల పంపిణీ వాయిదా  ★ రేపు నిర్మల్‌లో గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన ★ సిరిపల్లి చెక్ పోస్ట్ వద్ద రూ 1,53,000 నగదు పట్టివేత★ ముధోల్ ఇంటి నిర్మాణం తవ్వకాల్లో ఔరంగజేబు కాలంనాటి నాణేలు

News February 9, 2025

నందవరం చౌడేశ్వరి దేవి చరిత్ర మీకు తెలుసా?

image

బనగానపల్లె(M) నందవరంలో చౌడేశ్వరి దేవి ఆలయం ఉంది. బ్రాహ్మణులకు సాక్ష్యం చెప్పడానికి అమ్మవారు వారణాసి నుంచి నందవరానికి సొరంగం ద్వారా ఒకే రోజు వచ్చారని భక్తులు నమ్ముతారు. 4వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం చూడటానికి చాలా భయంకరంగా ఉండేదని ఆ ఊరి పూర్వీకులు చెబుతుంటారు. ఆ తర్వాత వేరే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయం ముందే సొరంగం ఉందని.. 10 మెట్లు దిగితే అమ్మవారి పాదాలు కనపడతాయని చెబుతారు.

error: Content is protected !!