News February 5, 2025
జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా ఉండేందుకు నరేశ్ నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
Similar News
News December 8, 2025
పాడేరు: టెన్త్ పరీక్షా ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 9వరకు ప్రభుత్వం పొడిగించినట్లు అల్లూరి DEO బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. రూ.50 పెనాల్టీతో ఈనెల 12, రూ.200ల పెనాల్టీతో 15, రూ.500ల పెనాల్టీతో 18వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. అల్లూరి జిల్లాలో 244 విద్యాలయాల్లో 11,354మంది పదో తరగతి విద్యార్థులున్నారన్నారు. అందరూ పరీక్షలకు హాజరు అయ్యేలా టీచర్స్ కృషి చేయాలన్నారు.
News December 8, 2025
ఈ హాస్పిటల్లో అన్నీ ఉచితమే..!

AP: వైద్యం కాస్ట్లీ అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని(కృష్ణా) రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ ఉచితమే. దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. పేదల సంజీవనిగా పేరొందిన ఈ హాస్పిటల్‌ను సందర్శించిన బీజేపీ నేత యామిని శర్మ ట్వీట్ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.
News December 8, 2025
కాజీపేటకు మరో రైల్వే ప్రాజెక్టు

KZPTలో ఇప్పటికే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వేగం పుంజుకున్నాయి. తాజాగా వ్యాగన్లు, రైలు ఇంజన్ల పిరియాడికల్ ఓవర్ హాలింగ్ షెడ్‌ను కాజీపేటలో ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. తొలుత MHBD తాళ్లపూసలపల్లిలో రూ.908 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదించినా, అక్కడి రేగడి నేల ఫౌండేషన్‌కు అనుకూలం కాదనే నివేదికతో ప్రాజెక్టును కాజీపేట సమీపానికి మార్చారు. 300 ఎకరాల భూసేకరణకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు.


