News July 1, 2024

జగిత్యాల: సంజయ్ దమ్ముంటే పదవికి రాజీనామా చెయ్: కేటీఆర్

image

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. సోమవారం జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంగిలి మెతుకులకు ఆశపడి తన స్వార్థం కోసం BRSను వదిలిపోయి దొంగల్లో కలిశాడని ఆరోపించారు. ఆయన పోవడంతో జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నారు. గాలికి గడ్డపారలు కొట్టుకపోవని గడ్డిపోచలు మాత్రమే పోతాయన్నారు.

Similar News

News December 17, 2025

ఓటమి ఎరగని మానకొండూరు సర్పంచ్ దంపతులు

image

మానకొండూరు మండల కేంద్రం సర్పంచ్ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ దంపతులు 2001 నుంచి ఓటమి లేకుండా విజయం సాధిస్తున్నారు. 2001లో శేఖర్ గౌడ్ ఎంపీటీసీగా, 2006లో ఎంపీపీగా, 2013లో ఆయన భార్య వర్షిణి సర్పంచ్‌గా గెలిచారు. 2019లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజారిటీ (13,652) ఓట్లు సాధించారు. ఇప్పుడు రెండోసారి సర్పంచ్‌గా BRS అభ్యర్థి తాళ్లపల్లి వర్షిణి శేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు.

News December 17, 2025

మూడోదశ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

image

కరీంనగర్ జిల్లాలో మూడోదశ గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సీపీ గౌష్ ఆలం ప్రత్యేక దృష్టి సారించారు. వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, వి.సైదాపూర్ మండలాల్లోని పోలింగ్, లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ఏర్పాటు చేసిన పటిష్ఠ భద్రతా చర్యలను పర్యవేక్షించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా, CCటీవీ పర్యవేక్షణ, ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు.

News December 16, 2025

కరీంనగర్: నిరుద్యోగులకు అవకాశం.. 19న జాబ్ మేళా

image

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈ నెల 19న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. ఆటోమోటివ్స్ KNR సంస్థలోని 20 పోస్టులకు గాను, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 20-40 ఏళ్ల పురుషులు అర్హులు. వేతనం రూ.14,000 నుంచి ప్రారంభమవుతుందని, ఆసక్తి గలవారు పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు 72076 59969 నంబర్లను సంప్రదించవచ్చు.