News February 18, 2025

జగిత్యాల: ‘సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం సర్వమానవాళికి ఆదర్శం’

image

బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం సర్వ మానవాళికి ఆదర్శమైనదని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల బంజారా భవన్‌లో మంగళవారం జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. సంతు సేవాలాల్ బంజారా జాతికే కాదు యావత్ ఇతర కులాలకు ఆదర్శ పురుషుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, డీఈవో రాము తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 24, 2025

లెక్చరర్ వేధింపులు.. కారేపల్లిలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థి ఇంగ్లిష్ లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లేందుకు అనుమతి అడిగినందుకు అధ్యాపకుడు దురుసుగా ప్రవర్తించడంతో మనస్తాపం చెంది లారీ కింద పడేందుకు ప్రయత్నించాడు. ఆ లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఆ అధ్యాపకుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది.

News November 24, 2025

గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించిన నూతన డీసీపీ

image

పెద్దపల్లి జోన్ గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ చర్యలు, పోలీసింగ్ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నూతనంగా నియమితులైన డీసీపీ సోమవారం ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. సబ్ డివిజన్ పరిధిలోని స్టేషన్ల వారీగా నేర గణాంకాలు, భద్రతా చర్యలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజా సేవల అమలు విధానాన్ని కూడా ఆయన తెలుసుకున్నారు.

News November 24, 2025

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన మీకోసంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తొలుత అధికారులతో సమావేశమై ఇప్పటి వరకు వచ్చిన అర్జీల పరిష్కార చర్యలపై శాఖల వారీగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు.