News February 18, 2025
జగిత్యాల: ‘సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం సర్వమానవాళికి ఆదర్శం’

బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం సర్వ మానవాళికి ఆదర్శమైనదని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల బంజారా భవన్‌లో మంగళవారం జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. సంతు సేవాలాల్ బంజారా జాతికే కాదు యావత్ ఇతర కులాలకు ఆదర్శ పురుషుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, డీఈవో రాము తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 19, 2025
వారానికి రెండుసార్లు ఫిజియోథెరపీ సేవలు: మహబూబ్‌నగర్ కలెక్టర్

ఇక నుంచి దివ్యాంగుల కోసం వారానికి రెండు సార్లు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ సేవలను అందిస్తామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష సమావేశం 183 మందికి దివ్యాంగులకు రూ.16 లక్షల విలువైన సహాయ పరికరాలను ఉచితంగా అందజేశారు. అంగ వైకల్యం కలిగిన ఎంతోమంది తమ వైకల్యాన్ని జయించి జీవితంలో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారని కలెక్టర్ గుర్తు చేశారు.
News March 19, 2025
మార్చి:19 చరిత్రలో ఈ రోజు

*1901: ఆంధ్రరాష్ట్ర తొలి శాసన సభ స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య జననం
*1952: సినీనటుడు మోహన్ బాబు జననం
*1952: సినీనటుడు, బాబుమోహన్ జననం
*1966: దివంగత ఐపీఎస్ ఉమేశ్ చంద్ర జననం
*1982: ఆచార్య జె.బి కృపలానీ మరణం
*2008: సినీనటుడు రఘవరన్ మరణం
*2022: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లుస్వరాజ్యం మరణం
News March 19, 2025
అలంపూర్‌లో విషాదం.. వ్యక్తి ఆత్మహత్య

ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక గత 20 రోజుల క్రితం నిప్పంటించుకున్న వ్యక్తి కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన నర్సింహులు ఆత్మహత్యకు యత్నించి సోమవారం రాత్రి మృతిచెందినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఓ ఫైనాన్స్ కంపెనీ వారు అతడిని వేధించారని, దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు.