News April 8, 2025
జగిత్యాల: సన్నబియ్యం లబ్ధిదారు ఇంట్లో కలెక్టర్, ఎమ్మెల్యే భోజనం

జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో సన్న బియ్యం లబ్ధిదారుడు కోలా సంజీవ్ ఇంట్లో కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌తో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. అనంతరం సెర్ప్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 22, 2025
రేపు హనుమకొండలో హాఫ్ మారథాన్

హనుమకొండ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించబోయే హాఫ్ మారథాన్‌లో పాల్గొనే వారికి కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి పాసులను అందజేశారు. ఓరుగల్లు నగరంలో మొదటి సారి నిర్వహిస్తున్న హాఫ్ మారథాన్‌ను విజయవంతం చేయాలన్నారు. కాళోజీ కళాక్షేత్రం నుంచి మారథాన్ ప్రారంభమై ఫారెస్ట్ ఆఫీస్, ఫాతిమా జంక్షన్, వడ్డేపల్లి, కాకతీయ యూనివర్సిటీ మీదుగా మళ్లీ కాళోజీ కళా క్షేత్రం వరకు మారథాన్ జరగనుంది.
News November 22, 2025
సింగూర్ ప్రాజెక్టు పరిశీలించనున్న అధ్యయన కమిటీ

సంగారెడ్డి జిల్లా వరప్రదాయని సింగూర్ డ్యాంను నేడు అధ్యయన కమిటీ పరిశీలించనున్నట్లు ఐబీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు మరమ్మతులపై సమాలోచనలు, మరమ్మతులకు డ్యాం ఖాళీ చేయాలా.. వద్దా.. అనే అంశంపై పరిశీలిస్తారు. డ్యామ్ ఖాళీ చేస్తే మూడు జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయని జలమండలి అధికారులు అంటున్నారు. ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అధ్యయన కమిటీ నిర్ణయం తీసుకోనుంది.
News November 22, 2025
మార్చురీలో వసూళ్లు.. ఉద్యోగులకు ఉద్వాసన

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాల పోస్టుమార్టం కోసం సహాయకులు <<18326791>>డబ్బులు వసూలు<<>> చేస్తున్నట్లు Way2Newsలో పబ్లిష్ అయిన కథనానికి అధికారులు స్పందించారు. వసూళ్లు రుజువు కావడంతో పాల్పడుతున్న సహాయకులను బాధ్యతల నుంచి తప్పిస్తూ సూపరింటెండెంట్ డా.ఎం.నరేందర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, మృతదేహాల ఫొటోగ్రాఫర్ సైతం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలియడంతో, అతణ్ని విధులకు రావొద్దని ఆదేశించారు.


