News April 2, 2025

జగిత్యాల: సాంఘిక శాస్త్రం రెగ్యులర్‌కు ఆరుగురు గైర్హాజరు

image

పదోతరగతి పబ్లిక్ పరీక్షలలో భాగంగా ఏడోరోజు సాంఘిక శాస్త్రం రెగ్యులర్ పరీక్ష కేంద్రాల్లో మొత్తం 11855 విద్యార్థులకు 11849 విద్యార్థులు హాజరయ్యారు. ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల హాజరుశాతం 99.95% సప్లమెంటరీ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష కేంద్రాలలో 8 విద్యార్థులకు 5 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి హాజరుశాతం 62.50%. ఉందని అధికారులు తెలిపారు.

Similar News

News April 10, 2025

ఎంపీ మేడాకు నోటీసులు

image

MP మేడా రఘునాథరెడ్డి, మాజీ MLA మేడా మల్లిఖార్జునరెడ్డిలకు JC రాజేంద్రన్ నోటీసులు జారీ చేశారు. వీరు నందలూరు (M) లేబాకలో పేదల పేరుతో అక్రమంగా దాదాపు 109 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణల కారణంగా నోటీసులు ఇచ్చారు. దీనిపై సరైన వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని JC హెచ్చరించారు.

News April 10, 2025

ఆదిలాబాద్ ట్రైనీ కలెక్టర్‌గా సలోని చాబ్రా

image

ఆదిలాబాద్‌ జిల్లాకు ట్రైనీ కలెక్టర్‌గా 2024 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారిణి సలోని చాబ్రాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ నిమిత్తం జిల్లాకు రానున్న ఆమె ఏడాది పాటు ఇక్కడ అందుబాటులో ఉండనున్నారు. మే 2న కలెక్టర్‌ రాజర్షి షాను కలిసి రిపోర్టు చేయనున్నట్లు సమాచారం. ఇది వరకు ఇక్కడ ట్రైనీ కలెక్టర్‌గా అభిగ్యాన్ మాలవియా ఉన్నారు.

News April 10, 2025

రేగిడి: పోక్సో కేసులో నలుగురి అరెస్ట్

image

విజయనగరం జిల్లా రేగిడి మండలానికి చెందిన జగదీశ్ ఈనెల 26న అదే మండలానికి చెదిన బాలికను ప్రేమ పేరుతో విజయవాడ తీసుకెళ్లిపోయాడు. బాలిక కనబడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తేలడంతో జగదీశ్‌తో పాటు అతనికి సాయం చేసిన మరో ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు బుధవారం తెలిపారు.

error: Content is protected !!