News January 30, 2025
జగిత్యాల: సీనియర్ సిటిజన్ల పోస్ట్ కార్డు ఉద్యమం

తమ డిమాండ్ల పరిష్కారానికి జగిత్యాల జిల్లాలోని సీనియర్ సిటిజన్‌లు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి సైకిల్ లపై వెళ్లి ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులకు పోస్ట్ కార్డులు వేశారు. ఈ కార్యక్రమంలో గౌరీశెట్టి విశ్వనాధం, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 19, 2025
పాకిస్థాన్‌లో రెపరెపలాడిన భారత జెండా

ఎట్టకేలకు పాకిస్థాన్‌లో భారత జెండా రెపరెపలాడింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అన్ని దేశాల పతాకాలు ఆతిథ్య దేశం స్టేడియాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ భారత మువ్వన్నెల పతాకాన్ని పాక్ క్రికెట్ బోర్డు విస్మరించింది. నిబంధనలు ఉల్లంఘించిన పాక్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో దిగొచ్చిన పీసీబీ ఇండియన్ ఫ్లాగ్‌ను ఇవాళ కరాచీలోని స్టేడియంపై ఏర్పాటు చేసింది.
News February 19, 2025
జగన్‌కు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేదు: షర్మిల

బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని AICC చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అసెంబ్లీకి వెళ్లి పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం YS జగన్‌కు, YCP MLAలకు లేదని విమర్శించారు. ‘నేరస్థులను జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు’ అని ట్వీట్ చేశారు.
News February 19, 2025
మధురవాడ: మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్

మధురవాడలో బుధవారం మరో సంచలనం చోటుచేసుకుంది. ఒడిశాలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి మధురవాడలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా పోలీసులు టవర్ లొకేషన్ ఆధారంగా వారిని గుర్తించారు. వెంటనే పీఎంపాలెం పోలీసుల సహాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పీఎంపాలెం పోలీసులు ఒడిశా పోలీసులకు వారిని అప్పగించారు.