News March 20, 2025
జగిత్యాల: సీసీ కెమెరాల నిఘాలో 10వ తరగతి పరీక్షలు: కలెక్టర్

ఈనెల 21 నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలు సీసీటీవీ కెమెరాల నిఘాలో జరుగుతాయని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాలో 67 పరీక్ష కేంద్రాలలో 11,865 మంది రెగ్యులర్ విద్యార్థులు, 285 మంది బ్యాక్ లాగ్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లకు అనుమతులు లేదన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు.
Similar News
News October 29, 2025
SRPT: విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు: ఎస్పీ

పోలీస్ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎస్పీ నర్సింహ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ వారిగా నమోదైన కేసులు, కేసు విచారణ గురించి అధికారులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యాప్ ద్వారా లోన్ ఇస్తామని చెప్పేవారి మాటలను నమ్మొద్దని సూచించారు.
News October 29, 2025
జనగామలో నవంబర్ 1 నుంచి శాతవాహన ట్రైన్ హాల్టింగ్

నవంబర్ 1 నుంచి జనగామలో శాతవాహన ట్రైన్కు హాల్టింగ్ ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు దశమంత్ రెడ్డి తెలిపారు. జనగామలో శాతవాహన ట్రైన్కు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవను కోరగా జనగామలో శాతవాహనకు హాల్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
News October 29, 2025
NZB: పతకాలు గుర్తింపు కాదు.. నిబద్ధతకు ప్రతీక CP

పతకాలు సిబ్బందికి గుర్తింపు మాత్రమే కాదని, వారి సేవా స్ఫూర్తికి, కష్టపడి పని చేసే నిబద్ధతకు ప్రతీక అని నిజామాబాద్ CP సాయి చైతన్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 95 మందికి వచ్చిన వివిధ రకాల సేవా పతకాలను మంగళవారం ఆయన సీపీ కార్యాలయంలో ప్రదానం చేసి మాట్లాడారు. ప్రజల, శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది చూపుతున్న సేవా మనోభావం ప్రశంసనీయమైనదని ప్రశంసించారు.


