News March 25, 2025
జగిత్యాల: స్కాలర్ షిప్నకు అప్లై చేసుకోండి

జగిత్యాల జిల్లాలోని డిగ్రీ చదివిన ఎస్సీ విద్యార్థులకు విదేశాల్లో పీజీ చేయడానికి రూ.20 లక్షల స్కాలర్షిప్ కోసం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ తెలిపారు. ఆసక్తి, అర్హత కలవారు మే 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాస్పోర్ట్, వీసా కల్గిన ఎస్సీ విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
కుజ దోషం తొలగిపోవాలంటే?

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.
News November 23, 2025
NZB: సాధారణ కార్యకర్త నుంచి DCC అధ్యక్షుడిగా..!

నిజామాబాద్ DCC అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి నియమితులయ్యారు. మోపాల్(M) ముల్లంగికి చెందిన చెందిన ఆయన 1986లో TDPనుంచి సర్పంచ్గా పని చేశారు. 1995లో కాంగ్రెస్లో చేరి 2004వరకు మోపాల్ సింగిల్ విండో ఛైర్మన్గా, 2014 వరకు 5 సార్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్గా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి అంచలంచెలుగా ఎదిగారు. 2023లో MLA టికెట్ ఆశించగా పార్టీ భూపతి రెడ్డికి టికెట్ ఖరారు చేసింది.
News November 23, 2025
నేడు పుట్టపర్తికి సీఎం రేవంత్ రెడ్డి

పుట్టపర్తిలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు హెలికాప్టర్లో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే బాబా శతజయంతి ఉత్సవాలకు హాజరు కానున్నారు. 11 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధి దర్శించుకుంటారు. 11.45 గంటలకు సత్యసాయి విమానాశ్రయం నుంచి తిరుగుపయనం అవుతారు.


