News February 4, 2025
జగిత్యాల: 3 నెలల క్రితమే పెళ్లైంది.. ఇంతలోనే విషాదం

వెల్గటూర్ PS పరిధిలోని అంబారీపేట గ్రామానికి చెందిన అల్లే సాగర్(28) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు. 3 నెలల క్రితమే మృతుడికి వివాహం జరిగిందని, అతడి తండ్రి అల్లె చంద్రయ్య నెలరోజుల క్రితమే ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారని గ్రామస్థులు తెలిపారు. పెళ్లికి, గల్ఫ్ వెళ్లటానికి రూ.6లక్షలు అప్పులు చేశాడని.. వీటిని తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
Similar News
News February 25, 2026
నేడు శ్రీ రంగనాథుడి బ్రహ్మోత్సవాలు.. 25 రాత్రి అంకురార్పణ..!

శ్రీ రంగనాథుడి బ్రహ్మోత్సవాలకు నేడు రాత్రి అంకురార్పణ జరగనుంది. 26ధ్వజారోహణం, 27సూర్యప్రభ వాహనం, 28శేష వాహనం, మార్చి 1న హనుమద్వాహన సేవ, మంటపోత్సవం, 2న మోహిని అలంకరణ సేవ, రాత్రి 8గంటలకు గరుడసేవ, 10గంటలకు కళ్యాణోత్సవం, 3న శ్రీవారి సేవ, గజవాహన సేవ, 4న ఉ. రా.10గంటలకు రథోత్సవం 5న అశ్వవాహన సేవ అరుణ చక్రస్నానం పూర్ణాహుతి ద్వజారోహణం శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన క్రతువులను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు.
News February 25, 2026
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 737 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షకు 737 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేశ్ తెలిపారు. బుధవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 21,101 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 20,364 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. 96.51 హాజరు శాతం నమోదు అయిందని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు.
News February 25, 2026
NGKL: నాగర్ కర్నూల్లో కేటీఆర్ పర్యటన

బీఆర్ఎస్ కార్యకర్తల కోలాహలం మధ్య మాజీ మంత్రి కేటీఆర్ నాగర్ కర్నూల్ చేరుకున్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన, ఆపై నేరుగా దీక్షా శిబిరానికి తరలివెళ్లారు. 58 రోజులుగా సాగుతున్న రిజర్వాయర్ వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలుపుతూ, అక్కడి నాయకులతో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. బాధితుల పక్షాన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


