News February 4, 2025

జగిత్యాల: 3 నెలల క్రితమే పెళ్లైంది.. ఇంతలోనే విషాదం

image

వెల్గటూర్ PS పరిధిలోని అంబారీపేట గ్రామానికి చెందిన అల్లే సాగర్(28) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు. 3 నెలల క్రితమే సాగర్‌కి వివాహం జరిగిందని, అతడి తండ్రి అల్లె చంద్రయ్య నెలరోజుల క్రితమే ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారని గ్రామస్థులు తెలిపారు. పెళ్లికి, గల్ఫ్ వెళ్లటానికి రూ.6లక్షలు అప్పులు చేశాడని.. వీటిని తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

Similar News

News November 21, 2025

జాతీయ అథ్లెటిక్ పోటీలకు ‘పుల్లేటికుర్రు’ విద్యార్థిని

image

జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు జడ్పీహెచ్ స్కూల్ 9వ తరగతి విద్యార్థిని చీకురుమిల్లి హర్షవర్ధని ఎంపికైనట్లు ఇన్‌ఛార్జ్ HM ధర్మరాజు శుక్రవారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-19 రన్నింగ్ పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో హర్షవర్ధని 1500 మీటర్ల రన్నింగ్‌లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని చెప్పారు.

News November 21, 2025

‘అరటి సాగుచేస్తున్న రైతులను ఆదుకోండి’

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరటి సాగుచేస్తున్న రైతులను వెంటనే ఆదుకోవాలని CPM నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో శుక్రవారం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నల్లప్ప, తదితర నాయకులు అరటి పంటలను పరిశీలించారు. గిట్టుబాటు ధర లేక అరటి సాగుచేస్తున్న రైతులు నష్టపోతున్నారని, వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

News November 21, 2025

TU: 5861 విద్యార్థుల హాజరు.. నలుగురు డిబార్

image

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నిజామాబాద్ లో ముగ్గురు, కామారెడ్డిలో ఒకరు డిబారయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్ష కేంద్రాలలో 6131 మంది విద్యార్థులకు గాను 5861 మంది విద్యార్థులు హాజరు కాగా 266 మంది గైర్హాజరయ్యారు. COE సంపత్ తో కలిసి బోధన్, ఆర్మూర్, ధర్పల్లి, కామారెడ్డి పరీక్షా కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు.