News February 4, 2025
జగిత్యాల: 3 నెలల క్రితమే పెళ్లైంది.. ఇంతలోనే విషాదం

వెల్గటూర్ PS పరిధిలోని అంబారీపేట గ్రామానికి చెందిన అల్లే సాగర్(28) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు. 3 నెలల క్రితమే సాగర్‌కి వివాహం జరిగిందని, అతడి తండ్రి అల్లె చంద్రయ్య నెలరోజుల క్రితమే ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారని గ్రామస్థులు తెలిపారు. పెళ్లికి, గల్ఫ్ వెళ్లటానికి రూ.6లక్షలు అప్పులు చేశాడని.. వీటిని తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
Similar News
News February 19, 2025
దారుణం.. బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్

తమిళనాడు కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. కునియముత్తూరులో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇంటర్ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటున్న బాలికకు సోషల్ మీడియాలో ఓ కాలేజీ విద్యార్థితో పరిచయమైంది. ఆమెను నమ్మించి తన గదికి రప్పించుకున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆరుగురు స్నేహితుల్ని ఆమెపైకి ఉసిగొల్పి పైశాచిక ఆనందం పొందాడు. నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
News February 19, 2025
ఖమ్మం: ముగ్గురు మంత్రులు ఉండి రైతులను పట్టించుకోరా?: MLC

ముగ్గురు మంత్రులండి జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం పట్టించుకోవడంలేదని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు నేరుశుల ఎల్లయ్య పంట పొలానికి నీరు అందక ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ప్రభుత్వ హత్య అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని, రైతు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
News February 19, 2025
సిద్దిపేట: ప్రియుడితో కలిసి భర్త హత్యకు యత్నం

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య యత్నించింది. పోలీసుల వివరాలిలా.. సిద్దిపేటలోని గుండ్లచెరువు కాలనీ వాసికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్యకు అదే కాలనీకి చెందిన శ్రవణ్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డుగా ఉన్న భర్త హత్యకు ప్రియుడితో కలిసి భార్య ప్లాన్ చేసింది. శ్రవణ్ తన స్నేహితులతో కలిసి 2సార్లు దాడి చేయగా భర్త ఇచ్చిన ఫిర్యాదుతో విచారించిన పోలీసులు శ్రవణ్‌ను రిమాండ్‌కు తరలించారు.