News February 24, 2025

జగిత్యాల: 48 గంటల పాటు మద్యం షాపులు బంద్

image

జగిత్యాల జిల్లాలో 48 మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని మద్యంషాపులు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు 25-02-2025 సాయంత్రం 4 గంటల నుంచి 27-02-2025 సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Similar News

News February 25, 2025

ఇంటర్ పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి: ASF కలెక్టర్

image

జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

News February 25, 2025

చికిత్సకు సహకరిస్తున్న పోప్ ఫ్రాన్సిస్

image

పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని వాటికన్ సిటీ తెలిసింది. ‘డబుల్ న్యూమోనియా’తో పాటు కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న పోప్ 11 రోజుల నుంచి రోమ్‌లోని గెమెల్లీ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. డబుల్ న్యూమోనియా వల్ల ఛాతీలో ఇన్‌ఫెక్షన్ సోకి ఆయన బ్రీతింగ్ తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తున్నారు.

News February 25, 2025

నల్గొండ: ఇంటర్, పది పరీక్షల నిర్వహణపై సమీక్ష

image

మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.  సోమవారం ఆయన తన చాంబర్లో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ,మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ఆయన తెలిపారు.

error: Content is protected !!