News March 29, 2025

జగిత్యాల: ACCIDENT.. వ్యక్తి మృతి

image

JGTL-KNR ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి 11గంటలకు కొండగట్టు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. మధుర నరేశ్ వాహనం అదుపుతప్పి పడగా.. అతన్ని కాపాడేందుకు వచ్చిన మల్యాల(M) గొర్రెగుండానికి చెందిన వంశీధర్ రావును అతివేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వంశీధర్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మల్యాల ఎస్ఐ తెలిపారు.

Similar News

News April 3, 2025

సిరిసిల్ల కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

image

కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా పై హైకోర్టు మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత తన ఇల్లు మిడ్ మానేరులో పోయిందని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కవితకు పునరావాసం కల్పించాలని కోర్టు తీర్పు ఇవ్వగా.. ఆ తీర్పు ఇల్లీగల్ ఆర్డర్ అంటూ మహిళపై కలెక్టర్ కేసు బుక్ చేయించారు. దీంతో విషయాన్ని ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News April 3, 2025

వెలిగండ్ల: ఇమ్మడి చెరువు సర్పంచ్ ఆత్మహత్య

image

వెలిగండ్ల మండలంలోని ఇమ్మడి చెరువు గ్రామ సర్పంచ్ తోకల బాలకృష్ణ(37) గురువారం ఉదయం బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వైసీపీ తరఫున సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బాలకృష్ణ మృతి పట్ల మండలంలోని పలువురు వైసీపీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 3, 2025

గుంటూరు జిల్లాలో బార్లకు ఈ-వేలం

image

రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు అబ్కారీ శాఖ నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిర్ణయించారు. ఏప్రిల్ 9న అత్యధిక బిడ్‌దారులకు లైసెన్సులు కేటాయించనున్నారు. అందులో గుంటూరు జిల్లాలో తెనాలి మునిసిపాలిటీకి-5, పొన్నూరు-2, మంగళగిరి-తాడేపల్లికి-1 కేటాయించారు.

error: Content is protected !!