News March 29, 2025

జగిత్యాల.. ACCIDENT.. వ్యక్తి మృతి

image

JGTL-KNR ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి 11గంటలకు కొండగట్టు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. మధుర నరేశ్ వాహనం అదుపుతప్పి పడగా.. అతన్ని కాపాడేందుకు వచ్చిన మల్యాల(M) గొర్రెగుండానికి చెందిన వంశీధర్ రావును అతివేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వంశీధర్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మల్యాల ఎస్ఐ తెలిపారు.

Similar News

News November 15, 2025

వేములవాడలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

image

దక్షిణ కాశీ వేములవాడ క్షేత్రంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు వరుసగా 25వ రోజు కార్తీక దీపోత్సవంలో భాగంగా భక్తులు భీమేశ్వరాలయం ఆవరణలో దీపాలను వెలిగించారు. కార్తీక దీపాలతో ఆలయ ఆవరణ కాంతులీనింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఆలయ ఈ రాజేష్, ఏఈఓ శ్రావణ్ ప్రసాదం, వాయనం అందజేశారు.

News November 15, 2025

రేపు బాపట్ల జిల్లాకు రానున్న గవర్నర్

image

గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌ నుంచి బయలుదేరి 11.45కి సూర్యలంక గోల్డెన్ సాండ్ బీచ్ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7.55కి తిరుగు ప్రయాణం అవుతారు. పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు.

News November 15, 2025

చంద్రగిరి: బీటెక్ విద్యార్థి మృతి

image

చంద్రగిరి మండలం కోదండరామాపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యానికి చెందిన లక్ష్మీకాంత్ చిత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్‌పై తిరుపతికి వచ్చే క్రమంలో లారీని ఢీకొన్నాడు. విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.