News April 13, 2025
జగిత్యాల: BRS సిద్ధమా..పూర్వ వైభవం వచ్చేనా..!

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. KRTL ఎమ్మెల్యే, ధర్మపురి మాజీ ఎమ్మెల్యే, JGTL నియోజకవర్గ నాయకులు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు భారీగా తరలివెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా సమాయత్తమవుతున్నారు. ఇది స్థానిక పోరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ సభ బీఆర్ఎస్కు కీలకం కానుంది.
Similar News
News November 28, 2025
ఏలూరు: మరో మూడు రోజులే గడువు

పీఎంఏవై (గ్రామీణ) – ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ తెలిపారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేనివారు, స్థలం లేని నిరుపేదలు, అసంపూర్తిగా ఇళ్లు ఉన్నవారు ఈ నెల 30లోగా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ‘ఆవాస్ ప్లస్’ యాప్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, అర్హులు వెంటనే స్పందించాలని ఆయన సూచించారు.
News November 28, 2025
వరంగల్: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.
News November 28, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 పెరిగి రూ.1,28,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 ఎగబాకి రూ.1,17,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


