News February 17, 2026

జగిత్యాల MLAపై ముప్పేటదాడి.. అయినా ధైర్యంగా ముందుకు..!

image

JGTL MLA సంజయ్‌పై వివిధ పార్టీల నేతలు రోజూ ముప్పేటదాడికి దిగారు. అయినా చలించకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లారు. పార్టీ మారావంటూ, ఎందులో ఉన్నావో చెప్పాలంటూ BRS ఎద్దేవ చేసినా, ఆ పార్టీ MLAలు మా సంసారంలో వేలెందుకు పెడతావన్నా, కాంగ్రెస్ నేతలు అవమానించినా వేరవలేదు. చివరకు కాంగ్రెస్ కౌన్సిలర్ల తరఫున MLA ప్రచారం చేసి తన వర్గాన్ని గెలిపించుకొని మున్సిపల్ ఛైర్మన్‌ చేసి ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇచ్చారు.

Similar News

News March 17, 2026

పుకార్లు నమ్మొద్దు, రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు: నాదెండ్ల

image

రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవొద్దని ఆయన సూచించారు. రోజుకు 2.81 లక్షల బుకింగ్స్ వస్తుంటే, అంతకంటే ఎక్కువగా 2.92 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు OTP ద్వారా గ్యాస్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్యానికి వాడిన వారిపై 616 కేసులు నమోదు చేశామన్నారు.

News March 17, 2026

మత మార్పిడులపై ఉక్కుపాదం.. కీలక బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం

image

బలవంతం, మోసం, ప్రలోభం, వివాహాల ద్వారా జరిగే మత మార్పిడులను నిషేధించే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్-2026కు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం నిందితులకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తారు. మైనర్, SC, ST, మహిళలు, రోగులతోపాటు సామూహిక మత మార్పిడులకు పాల్పడితే అదనంగా రూ.5 లక్షలు ఫైన్ ఉంటుంది. పదేపదే ఇవే నేరాలకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల జరిమానా విధిస్తారు.

News March 17, 2026

పనితీరులో పల్నాడు ఎంపీకి ఆరో స్థానం

image

MPల పనితీరుపై ‘రైజ్’ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో పల్నాడు MP లావు కృష్ణదేవరాయలు ఆరో స్థానంలో నిలిచారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఆయనకు 7.7 పాయింట్లు లభించాయి. పార్లమెంటులో సమస్యల ప్రస్తావన, నియోజకవర్గంలో లభ్యత వంటి అంశాల ప్రాతిపదికన ఈ స్కోరును వెల్లడించారు. పల్నాడు ప్రాంత అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన కృష్ణదేవరాయలు, ఉమ్మడి జిల్లా ఎంపీలలోనూ ఆకట్టుకునే పనితీరు కనబరుస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.