News February 3, 2025
జగిత్యాల: MLC కవితతో బీసీ, జాగృతి నేతల భేటీ

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదికను వెల్లడించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితతో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నేతలు భేటీ అయ్యారు. కవితను ఆమె నివాసంలో కలసిన నేతలు పలు అంశాలపై చర్చించారు. సర్వే గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత మేర రిజర్వేషన్లు పెరుగుతాయన్న అంశంపై కవిత వారితో చర్చించారు.
Similar News
News November 24, 2025
పెద్దపల్లి డీఈఓగా శారదకు అదనపు బాధ్యతలు

పెద్దపల్లి డీఈఓ డి.మాధవి సెలవుపై వెళ్లడంతో డీఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న జీ.శారదకు అదనపు డీఈఓ బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యా సంచాలకులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాధవి నవంబర్ 7న సెలవు దరఖాస్తు సమర్పించడంతో ఖాళీ ఏర్పడినందున ఈ తాత్కాలిక నియామకం చేపట్టారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు శారద డీఈఓగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
News November 24, 2025
కొడంగల్ వేదికగా స్థానిక ప్రచారం మొదలెట్టిన సీఎం

TG: 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి ప్రారంభించారు. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, మహిళలు ఆ చీరలు కట్టుకొని అభివృద్ధికి అండగా నిలిచే వారికి ఓటేయాలన్నారు. పదేళ్లు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా త్వరలోనే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు SEC షెడ్యూల్ విడుదల చేయనుంది.
News November 24, 2025
ఆ మద్యం దుకాణాన్ని తొలగించండి: నంద్యాల కలెక్టర్

నవంబర్ 7న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నందికొట్కూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మద్యం దుకాణం విద్యార్థుల్లో చెడు అలవాట్లకు దారితీస్తోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. మద్యం దుకాణాన్ని తొలగించే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు.


