News February 4, 2025
జగిత్యాల: SI శ్వేత మృతి బాధాకరం: ఎస్పీ

గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న ఎస్ఐ కొక్కుల శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆమె కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ శ్వేత మృతి చాలా బాధాకరమని తెలిపారు. శ్వేత మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలియజేశారు.
Similar News
News October 18, 2025
సోలార్ యూనిట్లు ప్రోత్సహించాలి: కలెక్టర్

జిల్లాలో సోలార్ యూనిట్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం మాట్లాడుతూ.. దీపావళి రోజు వాతావరణం కలుషితం చెయ్యని క్రాకర్స్ను మాత్రమే వెలిగించాలని ప్రజలకు సూచించారు. అన్ని రంగాల్లోనూ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చెయ్యాలని కోరారు.
News October 18, 2025
సంగారెడ్డి: జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు సిద్ధం కావాలి

జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు విద్యార్థులు ప్రయోగాలు చేసి సిద్ధం కావాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి శనివారం తెలిపారు. నవంబర్ నెలలో జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. సైన్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులతో ప్రాజెక్టులు తయారు చేయించాలని సూచించారు.
News October 18, 2025
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

AP: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు యాక్ట్ను సవరిస్తూ <