News February 4, 2025
జగిత్యాల: SI శ్వేత మృతి బాధాకరం: ఎస్‌పీ

JGTL గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న ఎస్ఐ కొక్కుల శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆమె కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ శ్వేత మృతి చాలా బాధాకరమని తెలిపారు. శ్వేత మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలియజేశారు.
Similar News
News February 12, 2026
GWL: ప్రజా వ్యతిరేక పాలనపై కార్మిక గర్జన: ఐఎఫ్‌టీయూ

కార్మిక చట్టాలను కాలరాస్తూ, దేశ సంపదను దోచిపెడుతున్న పాలకులకు బుద్ధి చెప్పేందుకే ఈ సమ్మె అని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ పేర్కొన్నారు. FEB 12న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గద్వాల పాత బస్టాండ్ వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను వీడి ప్రతి కార్మికుడిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
News February 12, 2026
సిద్దిపేట: 10వ తరగతి మొదటి మైలురాయి: DEO

విద్యార్థి జీవితంలో 10వ తరగతి మొదటి మైలురాయని, దానిని ఏకాగ్రతతో అధిగమించాలని DEO శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం విపంచి కళానిలయంలో 10 విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చదువును ఇష్టపడి చదివితే కష్టం కాదన్నారు. ఈ విద్యా సంవత్సరం 10 పరీక్ష ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. బిస్మాట్ స్టేట్ సెక్రటరీ జగ్గు మల్లారెడ్డి ఉన్నారు.
News February 12, 2026
GNT: 21న జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం

గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు వెల్లడించారు. జడ్పీ ఛైర్‌పర్సన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, సభ్యులందరూ సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


