News February 4, 2025
జగిత్యాల: SI శ్వేత మృతి బాధాకరం: ఎస్‌పీ

గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న ఎస్ఐ కొక్కుల శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆమె కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ శ్వేత మృతి చాలా బాధాకరమని తెలిపారు. శ్వేత మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలియజేశారు.
Similar News
News January 22, 2026
కామారెడ్డి: మున్సిపల్ ఎలక్షన్స్..అభ్యర్థులకు రూల్స్!

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ లో పోటీ చేయబోయే అభ్యర్థుల నిబంధనల మార్గదర్శకాలను ఇటీవల జారీ చేసింది.
* భారత పౌరుడై, 21 సం.లు నిండి ఉండాలి.
* మున్సిపల్‌లో ఓటు హక్కు కలిగి ఉండాలి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వీస్ నుంచి తొలగించిన వారు, IPలు పెట్టిన వారు పోటీకి అనర్హులు
* పార్టీ తరఫున పోటీచేసే వ్యక్తికి ఒక్కరు, ఇండిపెండెంట్ వ్యక్తికి 10 మంది అదే వార్డుకి చెందిన వారు ప్రతిపాదించాలి.
News January 22, 2026
ఆదిలాబాద్: రోడ్డుప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి

బోథ్ మోడల్ స్కూల్ మలుపు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగు(17) మృతిచెందాడు. మండలంలోని నేరడిపల్లెకు చెందిన జంగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రికార్డుల పనిపై కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జంగు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై పురుషోత్తం ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
News January 22, 2026
అభిషేక్ రికార్డు

టీమ్ ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచారు. 2,898 బంతుల్లోనే ఈ మార్కు చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రసెల్(2,942), టిమ్ డేవిడ్(3,127), విల్ జాక్స్(3,196), గ్లెన్ మ్యాక్స్‌వెల్(3,239) ఉన్నారు. కేవలం అంతర్జాతీయ మ్యాచులే కాకుండా లీగ్స్, డొమెస్టిక్ మ్యాచులు ఇందులోకి వస్తాయి.


