News February 15, 2025

జగిత్యాల: Wow.. వెరైటీ పెళ్లి రోజు శుభాకాంక్షల కార్డు

image

ఓ ఉపాధ్యాయురాలు తన పెళ్లి రోజు శుభాకాంక్షల కార్డును వినూత్నరీతిలో తయారుచేశారు. జగిత్యాల(D) మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఉపాధ్యాయురాలు రమ్య (శోభారాణి)-మురళి దంపతుల పెళ్లిరోజు ఈనెల 15న ఉంది. పెళ్లిరోజును శుభాకాంక్షల రూపంలో ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చారు. ‘choose the correct answer’, ‘true or false’, ‘match the followings’ తో వెరైటీగా క్రియేట్ చేశారు. ఈ పెళ్లిరోజు శుభాకాంక్షల కార్డు పలువురిని ఆకట్టుకుంటుంది.

Similar News

News March 23, 2025

SRHvsRR: జట్లు ఇవే

image

SRH: హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అభినవ్, అనికేత్, కమిన్స్, సిమర్‌జీత్, హర్షల్, షమీ

RR: జైస్వాల్, రాణా, జురెల్, పరాగ్, హెట్‌మెయిర్, శుభమ్ దూబే, జోఫ్రా, తీక్షణ, సందీప్, తుషార్ దేశ్‌పాండే, ఫరూఖీ

News March 23, 2025

తడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మ‌ృతి

image

తడ మండలం పెరియావట్టు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నై నుంచి ఉబ్బల మడుగు పర్యాటక కేంద్రానికి వెళుతుండగా కారు చెట్టుకు ఢీకొంది. ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి  తీవ్ర గాయాలు అయ్యాయి. కారు స్పీడ్ వల్ల  నుజ్జు నుజ్జు అయినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News March 23, 2025

షాద్‌నగర్‌లో హాస్టల్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం

image

షాద్‌నగర్ పట్టణంలోని బాలుర హాస్టల్‌ పైఅంతస్తు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి దూకాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్‌కి చెందిన చందు ఈరోజు మధ్యాహ్నం బిల్డింగ్ పైనుంచి అకస్మాత్తుగా కిందికి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

error: Content is protected !!