News February 17, 2025
జగ్గంపేట: తల్లిదండ్రుల చెంతకు అదృశ్యమైన బాలికలు

జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలు ఆదివారం స్కూల్కి రాకపోవడంతో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. అయితే స్కూల్కు రాలేదని ఫోన్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన జగ్గంపేట ఎస్సై రఘునాథరావు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఆ బాలికల ఆచూకీ తెలుసుకొని ఆదివారం తల్లిదండ్రులకు అప్పగించారు.
Similar News
News October 14, 2025
ప్రపంచ స్థాయిలోగుర్తింపు.. అందని హామీలు..!

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవాంజి దీప్తి ప్రపంచ స్థాయిలో రాణిస్తోంది. ఆస్ట్రేలియాలో ప్రపంచ పారా అథ్లెటిక్స్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. గతేడాది రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం రూ.కోటి నజరానా అందించారు. కానీ, గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల ఇంటి స్థలం హామీగానే మిగిలిపోయింది.
News October 14, 2025
దీపావళి.. శునకాలకు ప్రత్యేక పూజలు చేస్తారు!

నేపాల్లో దీపావళి సందర్భంగా ఐదు రోజుల తిహర్ జరుపుకుంటారు. ఇందులో భాగంగా రెండో రోజు శునకాలను పూజిస్తుంటారు. మానవుల పట్ల శునకాలు చూపించే విశ్వసనీయతకు కృతజ్ఞతలు చెప్పడానికి దీనిని పాటిస్తారు. వీధి, పెంపుడు కుక్కలనే తేడా లేకుండా అన్ని శునకాలకూ పూలమాలలు వేసి నుదిటిపై తిలకం దిద్దుతారు. వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందించి గౌరవిస్తారు. ఈ సంస్కృతి నేపాలీ ప్రజల జంతు ప్రేమను చాటుతుంది.
News October 14, 2025
నిర్మల్: జిన్నింగ్ మిల్లుల్లో అగ్నిమాపక పరికరాలు తప్పనిసరి

మంగళవారం సాయంత్రం అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ అభిలాష అభినవ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మిల్లులలో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు సహా అవసరమైన అన్ని వసతులు ఉండేలా చూడాలని ఆదేశించారు. వే బ్రిడ్జీలకు నిర్ణీత గడువులోపు స్టాంపింగ్ చేయించుకోవాలని సూచించారు. రైతులు పంటలు అమ్మిన వెంటనే నిర్ణీత గడువులోపు వారికి డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.