News February 17, 2025
జగ్గంపేట: తల్లిదండ్రుల చెంతకు అదృశ్యమైన బాలికలు

జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలు ఆదివారం స్కూల్‌కి రాకపోవడంతో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. అయితే స్కూల్‌కు రాలేదని ఫోన్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన జగ్గంపేట ఎస్సై రఘునాథరావు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఆ బాలికల ఆచూకీ తెలుసుకొని ఆదివారం తల్లిదండ్రులకు అప్పగించారు.
Similar News
News March 24, 2025
విశాఖలో ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి.. కేసు నమోదు

సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి చేసిన యజమానిపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఆక్సిజన్ టవర్స్‌లో నివాసం ఉంటున్న ప్రసాద్ ఇంటికి ఫుడ్ డెలివరీ చేయగా మర్యాదగా పిలవలేదని దాడి చేసి బట్టలు విప్పి బయటకు పంపించేశారు. వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఇంటి యజమాని ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
News March 24, 2025
పాల్వంచ: అమ్మకు ప్రేమతో..❤️

పాల్వంచకు చెందిన లక్ష్మి అనే మహిళ ప్రమాదవశాత్తు కిందపడి కోమాలోకి వెళ్లింది. అయితే ఆమె బతకడం కష్టమే అని వైద్యులు చెప్పడంతో ఆమె కొడుకు శరత్ నిపుణులను పిలిపించి మెటల్‌తో తల్లి పాదాలను చేయించి అమ్మపై ప్రేమను చాటుకున్నాడు. ఆ పాదాలకు లక్ష్మి పట్టీలు, మెట్టెలు అమర్చాడు. కాగా తల్లి మృతి చెందగా.. ఆదివారం లక్ష్మి దశదిశ కర్మ నిర్వహించారు. మెటల్ పాదాలతో పాటు ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఆసక్తిగా చూశారు.
News March 24, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.